ANIL ARORA : మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య ?

మలైకా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు

 


Published Sep 11, 2024 03:01:01 AM
postImages/2024-09-11/1726041598_malikaarora.jpg.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ క్వీన్ మలైకా అరోరా గురించి పరిచయం అక్కర్లేదు. అందాన్ని ఆరాధించే వారందరికి మలైకా బాగా తెలుసు. సినిమాల్లో కంటే బయటే ఎక్కువ ఫేమస్ . తన కంటే చిన్న వాడైన అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసి 5 సంవత్సరాల తర్వాత విడిపోయారు.  అయితే మలైకా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. తన తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు


బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా నేడు ఉదయం (బుధవారం సెప్టెంబర్ 11వ తేదీ) ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. అయితే అనిల్ అరోరా ముంబై సిటీలోని బాంద్రాలో  తాను  నివాసం ఉంటున్న బిల్డింగ్ టెర్రస్ పైకి వెళ్లి అక్కడి నుంచి కింద దూకి చనిపోయారు. అనీల్ కు కొన్నాళ్లు ఆరోగ్యం బాలేదు. దీని కారణంగానే చనిపోయి ఉండవచ్చంటున్నారు తెలిసివ్యక్తులు.


పోలీసులు  ఘటన స్థలానికి వచ్చి  విచారణ చేస్తున్నారు.  అలాగే ఆత్మహత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. అయితే అనిల్ అనారోగ్యం వల్లే ఆత్మహత్య చేసుకున్నారా, మరీ ఏ ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

newsline-whatsapp-channel
Tags : news-line sucide malika-arora anil-arora

Related Articles