ఆ వార్తల్లో నిజం లేదు. నాకు హైదరాబాద్ లో కాని ముంబై లో కాని ఇళ్లులేవు మరి ఎలా అమ్ముతాను..హైదరాబాద్ లో నేను ఉంటున్న ఇళ్లు మా నాన్నది అంటూ చెప్పుకొచ్చింది
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏంటి మంచక్కకి అప్పులా అంటే అవునంట...స్వయంగా లచ్చక్కే చెప్పింది..రీసెంట్ గా మంచులక్ష్మి మెయిన్ లీడ్ లో చేస్తున్న మూవీ "దక్ష" మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ మూవీ ఈ నెల 19 వ తేదీన థియేటర్లకు వస్తుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో ఈ విషయం చెప్పారు. కొన్ని నెలలుగా ముంబై లో ఉంటున్నాను..నాకు ఇళ్లు లేదు. రెంట్ కి ఉంటున్నా..కాని ఇక్కడ మాత్రం నేను ఇళ్లు అమ్మకానికి పెట్టానని వార్తలు వస్తున్నాయి . అయితే ఆ వార్తల్లో నిజం లేదు. నాకు హైదరాబాద్ లో కాని ముంబై లో కాని ఇళ్లులేవు మరి ఎలా అమ్ముతాను..హైదరాబాద్ లో నేను ఉంటున్న ఇళ్లు మా నాన్నది అంటూ చెప్పుకొచ్చింది. ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా..కాని దీని నుంచి నేను బయటపడడానికి ప్రయత్నిస్తాఅని చెప్పింది లచ్చక్క.