కన్నప్ప సినిమాకు ఒక అసమర్దుడిని VFX సూపర్ వైజర్ గా పెట్టుకున్నాను. నిజానికి అదే నేను చేసిన పెద్ద తప్పు. దీని వల్ల సినిమా ఏడాది ఆలస్యం అయ్యింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మంచు విష్ణు కన్నప్ప సినిమా జూన్ 27 రిలీజ్ అవుతుంది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ఈ సినిమాలో క్రూ కూడా చాలా ఎక్కువ . పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, మోహన్ లాల్, శరత్ కుమార్, మోహన్ బాబు, మధుబాల.. ఇలా చాలా మంది స్టార్స్ ఉన్నారు.వీఎఫ్ ఎక్స్ చాలా పెండింగ్ ఉన్నట్లు ఇప్పటికే మంచు విష్ణు తెలిపారు.
అయితే కన్నప్ప మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాకు VFX విషయంలో ఎదురైన ఇబ్బందుల గురించి తెలిపాడు. కన్నప్ప సినిమాకు ఒక అసమర్దుడిని VFX సూపర్ వైజర్ గా పెట్టుకున్నాను. నిజానికి అదే నేను చేసిన పెద్ద తప్పు. దీని వల్ల సినిమా ఏడాది ఆలస్యం అయ్యింది. ఈ సినిమాతో నేను చాలా నేర్చుకున్నాను. VFX సమస్యలు, VFX కంపెనీల గురించి, ఎక్కడ సమస్యలు ఉన్నాయి అని తెలుసుకున్నాను. ఒక్క సూపర్ వైజర్ వల్ల నాకు 10, 15 కోట్లు నష్టం వచ్చింది.
అందుకే ఈ సంవత్సరం నుంచి మోహన్ బాబు యూనివర్సిటీలో విఎఫ్ఎక్స్ కోర్స్ 3 ఇయర్స్ డిగ్రీ మొదలు పెడుతున్నాం. మరో మూడేళ్లలో మా కాంపౌండ్ నుంచే VFX టీమ్ , సూపర్ వైజర్స్ ను రెడీ చేస్తున్నాంఅని మంచు విష్ణు తెలిపారు.