Kannappa: ‘కన్నప్ప’ నుంచి ఐశ్వర్య ‘ లుక్ రిలీజ్ .."మారెమ్మ" గా స్టన్నింగ్ లుక్ !


ఈ వారం ఐశ్వర్య క్యారక్టర్ మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్


Published Sep 23, 2024 09:23:00 PM
postImages/2024-09-23/1727106991_Screenshot20240923212606.png

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ :విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి వరుస అప్ డేట్లు వస్తూనే ఉన్నాయి. ప్రతి సోమవారం కన్నప్ప నుంచి ఓ తాజా కబురు వినిపిస్తూనే ఉంది. కన్నప్ప నుంచి ప్రతి క్యారక్టర్ ను , వారి ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇప్పటి వరకు శరత్ కుమార్ , మధుబాల, దేవరాజ్ , ముఖేష్ రిషి , మంచు అవ్రామ్ , అర్పిత్ రంకా , అక్షయ్ కుమార్ పాత్రలకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు.లాస్ట్ వీక్ కన్నప్ప నుంచి తిన్నడు ఉపయోగించే గుర్రం టిక్కి లుక్ ను రిలీజ్ చేశారు.


ఈ వారం ఐశ్వర్య క్యారక్టర్ మారెమ్మ పాత్రకు సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. అడివిని పీడించే అరాచకం మారెమ్మ... కుతంత్రమే ఆమె మంత్రం అంటూ రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఐశ్వర్య లుక్ స్టన్నింగ్ గా ఉందంటున్నారు నెటిజన్లు. మెల్ల మెల్లగా సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి.ఇప్పటికే టీజర్ తో సినిమా మీద కాస్త హైప్ పెరిగింది. టైటిల్ రోల్ లో మంచు విష్ణు చాలా డిఫరెంట్ రోల్ లో కనిపించనున్నారు.


అవా ఎంటర్టయిన్ మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్‌లో ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

newsline-whatsapp-channel
Tags : manchu-vishnu kannappa

Related Articles