మృణాల్ ను ఏ మూవీ లో చూసినా చాలా మినిమమ్ మేకప్ తో క్లాసీ లుక్ కనిపిస్తుంది.మేకప్ వేసినా అది ఆమెకు అసలు ఓవర్ గా అనిపించదు. మృణాల్ తన బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మృణాల్ ను ఏ మూవీ లో చూసినా చాలా మినిమమ్ మేకప్ తో క్లాసీ లుక్ కనిపిస్తుంది.మేకప్ వేసినా అది ఆమెకు అసలు ఓవర్ గా అనిపించదు. మృణాల్ తన బ్యూటీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. తాను హీరోయిన్ కదా అని.. బ్రాండెడ్ క్రీములు, ఆయిల్స్ వాడదట. కెమికల్స్ ఉండే ఉత్పత్తులకు బదులు... ఆర్గానిక్ ఉత్పత్తులు మాత్రమే వాడుతుందట. వాటి కారణంగానే ఆమె సహజంగా అందంగా కనపడుతుందట. అందుకే ఆమె అందం చాలా నేచురల్ గా అనిపిస్తుంటుంది.
మృణాల్ తన స్కిన్ ఫ్లాలెస్ గా కనిపించడం కోసం, స్మూత్ గా మారేందుకు ఎందుకు ఆమె కలబంద గుజ్జు వాడతారట. లోషన్స్ కాని సన్ స్క్రీన్ లోషన్స్ కాని వాడదట. జస్ట్ కలబంద గుజ్జు మాత్రమే సాఫ్ట్ స్కిన్ కు చిట్కా..
తన ముఖానికి బొప్పాయి మాస్క్ ని లేదంటే.. బొప్పాయి, తేనె, పంచదార కలిపిన స్క్రబ్ ని కానీ తరచూ ఉపయోగిస్తూ ఉంటారట. దీని వల్ల.. ముఖం మెరుస్తూ కనపడుతుంది. స్క్రబ్ వల్ల దాదాపు ఫేస్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ పోయి చర్మం సాఫ్ట్ గా ఉంది. తన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్ గా ఉంచుకునేందుకు ఆమె మంచినీరు కూడా ఎక్కువగా తాగుతూ ఉంటారట. దాని వల్ల చర్మం తాజాగా కనిపిస్తూ ఉంటుంది.
ఇక.. తన శరీరాన్ని అందంగా ఉంచడమే కాదు... ఫిట్ గా ఉంచుకోవడానికి కూడా ఆమె శ్రద్ధ చూపిస్తారు. అందుకోసం ప్రతిరోజూ ఆమె వర్కౌట్స్ చేస్తూ ఉంటారట. వర్కౌట్స్ కారణంగా కూడా చర్మం సహజంగా అందంగా కనిపిస్తుందట. జంక్ ఫుడ్ తినకుండా...హెల్దీ ఫుడ్ తింటూ ...జస్ట్ ఇంట్లో ఫుడ్ ను మాత్రమే ప్రిఫర్ చేస్తానంటుంది మృణాల్.