తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అనే పేరు చెప్పగానే చాలామంది చిరంజీవి సురేఖ అంటారు. ఆ తర్వాత స్థానంలో నాగార్జున అమలే ఉంటారు. ఈ విధంగా మూడు దశాబ్దాలకు పైగా అన్యోన్యంగా
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ అనే పేరు చెప్పగానే చాలామంది చిరంజీవి సురేఖ అంటారు. ఆ తర్వాత స్థానంలో నాగార్జున అమలే ఉంటారు. ఈ విధంగా మూడు దశాబ్దాలకు పైగా అన్యోన్యంగా జీవిస్తూ వారు 10 మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అలాంటి నాగార్జున వెంట అమల ఎప్పుడూ ఉంటూ తనకు బాసటను ఇస్తూ ఉంటుంది. నాగార్జునకు చెప్పకుండా కనీసం చిన్న గుండు పిన్ను కూడా ఆమె కదపదు. అంటే నాగార్జున అమల మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి వీరిద్దరి మధ్య ఓసారి తీవ్రమైన గొడవ వచ్చిందట. దీంతో నాగార్జున పది రోజుల వరకు అమలతో మాట్లాడలేదట. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా..
అమల జంతు ప్రేమికురాలని అందరికీ తెలుసు. ఆమె జంతువులకు ఎక్కడ ఏం జరిగినా తొందరగా రియాక్ట్ అవుతుంది. ఇదే కాదు ఆమె రెడ్ క్రాస్ సొసైటీ నెంబర్ కూడా, ఈ విధంగా నాగార్జున ఇంట్లో అనేక డాగ్స్ ఉంటాయి. ఇందులో నాగార్జునకు చాలా ఇష్టమైన కుక్క లాబ్రడార్. దీన్ని నాగార్జున ఎంతో ఇష్టపడతారట. అంతేకాదు నాగార్జున ఏదైనా పని మీద బయటకు వెళ్లి రాగానే ఆ లాబ్రడార్ పరుగున వెళ్లి నాగార్జున చెంత చేరుతుందట.
ఈ విధంగా నాగార్జున లాబ్రడార్ మధ్య మంచి సాన్నిహిత్యం పెరిగిపోయింది. ఓ రోజు నాగార్జున షూటింగుకు వెళ్లి వచ్చేసరికి లాబ్రడార్ డాగ్ కనిపించలేదట. అది ఎక్కడ ఉందని అమలను అడిగితే నెల రోజులు ట్రైనింగ్ పంపానని చెప్పిందట. దీంతో నాగార్జున ఆమెపై తీవ్రంగా ఫైర్ అయిపోయి పది రోజుల వరకు మాట్లాడలేదట. చివరికి లాబ్రడార్ కు ట్రైనింగ్ తప్పకుండా అవసరమని తెలుసుకున్న నాగార్జున తనంతట తానే వచ్చి మళ్లీ అమలతో మాట్లాడారట.