నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లికి సిద్ధం అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నటువంటి వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన డేటు
న్యూస్ లైన్ డెస్క్: నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల త్వరలో పెళ్లికి సిద్ధం అయిపోతున్నారు. ఈ మధ్యకాలంలోనే కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా ఎంగేజ్మెంట్ జరుపుకున్నటువంటి వీరిద్దరూ పెళ్లికి సంబంధించిన డేటు త్వరలోనే వెల్లడించనున్నారు. అయితే ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ జంట గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు. వీరి ప్రేమ ఎక్కడ పుట్టింది. ఎక్కడ కలిశారు. అనే దానిపై అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు.
అంతేకాదు సమంతను కూడా ఈ వ్యవహారంలోకి లాగి ఆమె గురించి కూడా అనేక వార్తలు రాస్తూ వస్తున్నారు. ఇది ఇలా నడుస్తున్న తరుణంలో నాగచైతన్య శోభిత పెళ్లికి సంబంధించిన విషయంలో నాగార్జున ఒక షాకింగ్ కండిషన్ పెట్టారని తెలుస్తోంది. సమంత నాగచైతన్యలు లవ్ చేసుకుని వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అక్కినేని ఫ్యామిలీ ఎలాంటి కండిషన్స్ పెట్టలేదట. దీంతో సమంత పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో రాణించింది. అయితే ఫ్యామిలీ మెన్ అనే వెబ్ సిరీస్ అక్కినేని ఫ్యామిలీలో గొడవలకు కారణమైందని టాక్ వినిపిస్తోంది.
ఇందులో చైతు మాత్రం అలాంటిదేమీ లేదని ఈ చిత్రంలో సమంత మంచి పాత్రలో నటించిదని అన్నారు. లో లోపల మాత్రం ఈ సినిమాలో నటించడం వల్లే వారి మధ్య గొడవ స్టార్ట్ అయిందని వార్తలు వినిపించాయి. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం శోభిత ధూళిపాళ్ల నాగచైతన్య పెళ్లి ద్వారా ఒక్కటి కాబోతున్నారు. ఇదే తరుణంలో నాగార్జున మరియు ఫ్యామిలీ శోభితాకు ఒక చిన్న కండిషన్ పెట్టారట. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించవచ్చు కానీ నువ్వు ఎలాంటి పాత్రలో చేయబోతున్నావో నాగచైతన్యకు చెప్పి చేయమని చెప్పారట. అది బోల్డ్ పాత్ర అయినా సరే ఇతర ఏ పాత్ర అయినా సరే ఇద్దరు అనుకొని చేస్తే బాగుంటుందనే కండిషన్ పెట్టినట్టు సమాచారం.