నీతా బొద్దుగానే ఉండేవారట. కసరత్తులు చేశారో డైట్ చేశారో కాని 18 కేజీల బరువు తగ్గి ఇప్పుడు మనకు అందంగా కనిపిస్తున్నారట.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ నిజానికి చాలా అందంగా ఉంటారు. అసలు ఆ వయసులో కూడా పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. దాదాపు ఫిజికల్ ఫిట్ నెస్ కే దాదాపు రోజుకు 10 లక్షలు ఖర్చు చేస్తుంది . అలాంటిది బరువు పెరగకుండా ఎంత జాగ్రత్తలు తీసుకుంటారు చెప్పండి. అయితే కాస్త వయసులో ఉన్నపుడు నీతా బొద్దుగానే ఉండేవారట. కసరత్తులు చేశారో డైట్ చేశారో కాని 18 కేజీల బరువు తగ్గి ఇప్పుడు మనకు అందంగా కనిపిస్తున్నారట.
రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్ట్ గా, రిలయన్స్ ఫౌండేషన్, ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ ఛైర్ పర్సన్, వ్యవస్థాపకురాలిగా కూడా ఆమె వ్యవహరిస్తూ వస్తున్నారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూనే... తన డైట్ తో.. ఏకంగా 18 కేజీల బరువు తగ్గింది .
నీతా అంబానీ తన బరువు తగ్గించడానికి కఠినమైన వ్యాయామాలు ఏమీ చేయలేదు. ఫుడ్ లో మార్పులు చేసుకొని బరువు తగ్గారట. నీతా చిన్న కుమారుడు అనంత్ అంబానీ అధిక బరువు ఉంటాడనే విషయం తెలిసిందే. ఆ బరువు కారణంగా ఉబకాయం, ఆస్తమాతో బాధపడ్డాడు. స్టెరాయిడ్స్ వాడాలసి వచ్చింది. మధ్యలో తన కొడుకు బరువు తగ్గడం కోసం చాలా కష్టపడ్డారు. తగ్గారుకూడా ..ఆ టైంలోనే నీతా కూడా బరువు తగ్గారట.