Aarti: నో విడాకులు.. కలిసిపోతున్న జయం రవి ఆర్తి..?

కోలీవుడ్ జంట జయం రవి ఆర్తి లు విడాకులు అనౌన్స్ చేయడంతో చాలామంది వీరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే ఈ విడాకుల విషయంపై ఎన్నో వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక జయం రవి సింగర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని,


Published Oct 01, 2024 10:49:00 AM
postImages/2024-10-01/1727759940_jayamraviaarti.jpg

న్యూస్ లైన్ డెస్క్: కోలీవుడ్ జంట జయం రవి ఆర్తి లు విడాకులు అనౌన్స్ చేయడంతో చాలామంది వీరి ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. అయితే ఈ విడాకుల విషయంపై ఎన్నో వార్తలు కోలీవుడ్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక జయం రవి సింగర్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని,అందుకే.విడాకులు ఇస్తున్నాడు అని కొంతమంది అంటే జయం రవి,సింగర్ కేనీషా మాత్రం మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు అని కొట్టి పారేస్తున్నారు.

ఇక జయం రవి భార్య ఆర్తి అయితే అసలు నాకు విడాకులే ఇష్టం లేదు. వీలైతే నేను మాట్లాడి అన్ని విషయాలు సరి చేసుకుందామని అనుకుంటున్నాను అని చెబుతోంది. కానీ జయం రవి అవకాశం ఇవ్వట్లేదని టాక్.అయితే తాజాగా ఆర్తి పెట్టిన పోస్ట్ చూస్తే మళ్లీ ఈ జంట కలిసిపోతున్నట్టు తెలుస్తోంది. మరి ఇంతకీ ఆర్తి పెట్టిన పోస్ట్ లో ఏముందో ఇప్పుడు చూద్దాం.. విడాకులు ఇష్టం లేని జయం రవి భార్య తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్ట్ పెట్టింది.

ఇక ఆ పోస్ట్ లో ఏముందంటే.. నాకు కోర్టు మీద న్యాయ వ్యవస్థ మీద పూర్తి నమ్మకం ఉంది. టైం ఇస్తే నేను ఆయనతో మాట్లాడాలి అనుకుంటున్నాను.పరిస్పర అంగీకారంతోనే విడిపోతున్నట్టు లేఖ రావడంతో నేను షాక్ అయ్యాను. ఇప్పటికి కూడా నేను ఆయనతో పర్సనల్ మాట్లాడానికి రెడీగా ఉన్నాను.మా ఇరువురి పరువు కి భంగం కలిగించే వాటిని నేను ఎంకరేజ్ చేయను.

అలాగే నాకు వివాహ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది..అంటూ ఆర్తి సంచలన పోస్ట్ పెట్టింది.ఇక ఆర్తి పోస్ట్ చేసిన చాలా మంది నెటిజెన్స్ ఆర్తి విడాకులు వద్దని భర్తతో కలిసి పోవాలని చూస్తోంది.ఒకవేళ దీనికి రవి ఒప్పుకుంటే మాత్రం ఈ జంట విడాకులకు బ్రేక్ పడుతుంది అని కామెంట్స్ పెడుతున్నారు

newsline-whatsapp-channel
Tags : news-line kollywood jayam-ravi aarthi jayam-ravi-divorce singer-keneeshaa

Related Articles