ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఎప్పుడు ఏదో ఒక మోటివేషన్ స్పీచ్ తో ప్రజల గుండెల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇలాంటి నీతా అంబానీ తాజాగా ఆడపిల్ల, కన్యాదానం అంటే ఏంటో వివరించి అందరి మదిని దోచుకుంది. అయితే తన రెండవ కుమారుడు అనంత్ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఉండేటువంటి ప్రాచుర్యం గురించి వివరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
న్యూస్ లైన్ డెస్క్: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ అంటే తెలియని వారు ఉండరు. ఆమె ఎప్పుడు ఏదో ఒక మోటివేషన్ స్పీచ్ తో ప్రజల గుండెల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇలాంటి నీతా అంబానీ తాజాగా ఆడపిల్ల, కన్యాదానం అంటే ఏంటో వివరించి అందరి మదిని దోచుకుంది. అయితే తన రెండవ కుమారుడు అనంత్ రాధిక మర్చంట్ పెళ్లి వేడుకలో హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఉండేటువంటి ప్రాచుర్యం గురించి వివరిస్తూ ఆశ్చర్యపరుస్తోంది.
అలాంటి నీతా అంబానీ గురించి ప్రస్తుతం ఒక వార్త నెట్టింటా వైరల్ అవుతుంది. ఆమె ఒకసారి తాగే కాఫీ ధర లక్షలాది రూపాయలు ఉంటుందట. ఆ వివరాలు ఏంటో చూద్దాం. దేశంలోనే అత్యంత ధనికుల్లో ముఖేష్ అంబానీ కుటుంబం ఒకటి. అలాంటి వీరు ఎంతటి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారో చాలామందికి తెలియదు. వాళ్ళు తాగే కాఫీ నుంచి మొదలు ప్రతి ఒక్కటి ఖరీదైనవే ఉంటాయి. అందుకే వారు ఎంత వయసు వచ్చినా, తక్కువ వయసు వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు. ప్రస్తుతం నీతా అంబానీ వయసు 60 సంవత్సరాలు.
30 ఏళ్ల అమ్మాయిల కనిపిస్తూ ఉంటుంది. కోడళ్లతో పోటీ పడుతూ ఫోటోషూట్లు చేసుకుంటుంది. అలాంటి నీతా అంబానీ తాగే కాఫీ లక్షల్లోనే ఉంటుందట. ఆమె ఉదయం లేవగానే మూడు లక్షల రూపాయల విలువైనటువంటి కాఫీతో తన రోజును మొదలు పెడుతుందని తెలుస్తోంది. ఈ విధంగా నీతా అంబానీ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టే ఇంకా తన అందాన్ని కోల్పోకుండా ఉంచుకోగలిగింది. ఆమె తాగే కాఫీ మూడు లక్షలు అని చెప్పడంతో చాలామంది షాక్ అవుతున్నారు. సాధారణ మధ్యతరగతి ప్రజల సంవత్సర బడ్జెట్ మూడు లక్షలు అని కామెంట్లు పెడుతున్నారు.