ఆత్మ ను అమ్మడం ఏంటని అందరు వదిలేస్తే కరీనా అనే మహిళఆ ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకుని తన ఆత్మను అమ్మడానికి అంగీకరించింది.
న్యూస్ లైన్ ,స్పెషల్ డెస్క్: ట్రెండ్ అవ్వాలంటే చాలు ఏదో ఒక పిచ్చి పని చేస్తే సరి..యూత్ ఇలానే ఉన్నారు. ఆ దేశం ఈ దేశం అని కాకుండా అన్ని దేశాల్లోను క్రింజ్ పీపుల్ ఎక్కువైపోయారు. లేకపోతే ఆత్మను అమ్మేసుకోవడం ఏవిటో ..అమ్మేసిన మనిషికి కొనుకున్న మనిషికి ఇద్దరికే తెలియాలి దీని అర్ధమేంటో. రష్యాలో ఓ మహిళ తన ఆత్మను 33 కోట్ల రూపాయలకు అమ్మిందట. పోనీ జోక్ చేస్తుందేమో అంటే దిమిత్రి అనే ఆమె రష్యన్ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ అయిన Vkontakte సైట్ లో సరదాగా పోస్ట్ చేసిందట.
అయితే ఆత్మ ను అమ్మడం ఏంటని అందరు వదిలేస్తే కరీనా అనే మహిళఆ ఆఫర్‌ను సీరియస్‌గా తీసుకుని తన ఆత్మను అమ్మడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం రక్తంతో వ్రాసి సంతకం చేసిన ఒప్పందం కుదుర్చుకుంది. తన ఆత్మను కొన్నందుకు రక్తంతో ఒప్పందం కూడా చేసుకున్నారట. ఆ పేపర్లను కూడా అప్ లోడ్ చేసింది. ఇక ఆ పోస్ట్ కు జనాల కామెంట్లు చూడాలి. ఫేమస్ అవ్వడానికి ఆత్మను అమ్మేసావా అక్కా..అంటూ కామెంట్లు పెడుతున్నారు.