samantha: ఈ టైం లో వినేష్‌కి అండగా నిలుస్తూ హీరోయిన్ సమంత ఓ పోస్ట్ పెట్టింది.


Published Aug 07, 2024 08:24:00 PM
postImages/2024-08-07/1723042585_sam.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఎన్నో యేళ్ల కష్టం..అడుగు దూరంలో లక్ష్యం ...ఎన్నో లక్షల మంది పెట్టుకున్న నమ్మకం ...చిన్న కారణం వల్ల పోవడం అంటే మామూలు కష్టం కాదు...ఏ ప్లేయర్ కైనా కంటతడిపెట్టించే విషయమే. పారిస్ ఒలింపిక్స్‌లో ఖచ్చితంగా గోల్డ్ మెడల్ సాధిస్తుందనుకున్న రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 50 కేజీల విభాగంలో వినేష్ పాల్గొనాల్సి ఉండగా ఆమె బరువు  100 గ్రాములు ఎక్కువగా ఉందంటూ అనర్హత వేటు వేసింది ఒలింపిక్ కమిటీ. విషయం తెలిసిన  భారత్ ఒక్క సెకన్ లో తన కలలు చెదిరిపోతున్నందుకు చాలా బాధపడింది. ఈ టైం లో వినేష్‌కి అండగా నిలుస్తూ హీరోయిన్ సమంత ఓ పోస్ట్ పెట్టింది.


నిజానికి సమంత మాత్రమే కాదు ...ఈ విషయం తెలిసిన దగ్గరి నుంచి ప్రతి ఒక్క భారతీయుడు బాధపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి వేళ వినేష్‌కి ధైర్యం చెబుతూ అండగా నిలిచింది హీరోయిన్ సమంత. భారత్ బంగారు పతకం కళ చెదిరిపోయింది. దీని కోసం వినేష్ కు తన శరీరంలో కొంత రక్తం తీశారు. తన జుట్టు ను కత్తిరించారు ..ఏ మాత్రం బరువు తగ్గినా..తను ఆడుతుందనే నమ్మకంతో చాలా చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.


"అత్యంత శక్తివంతులకే కాలం కఠినమైన సమస్యలు విసురుతుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో ఈ క్షణం నువ్వు ఒంటరివి కాదు.. ఆ దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. కష్టాల మధ్య కూడా నిలదొక్కుకునే నీ సామర్థ్యం నిజంగా ప్రశంసనీయం. ఇంతటి బాధను దాటుకురావడమే పెద్ద గెలుపు...నీ చుట్టు మేమున్నామంటు వినేష్ ఫొగాట్ ఫొటో ట్యాగ్ చేసింది. 
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu samantha paris-olympic olympic2024-

Related Articles