ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రూమర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చాలామంది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి మరి గెలికేస్తున్నారు. ఏదో కామెడీ చేస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ, సొంత జీవితంలో వేలు పెట్టి గెలికితే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఆ విధంగానే స్టార్ క్రికెటర్ షమీ స్పందించారు. మరి ఆయన దేనికి స్పందించారు. ఆ వివరాలు చూద్దాం.
న్యూస్ లైన్ డెస్క్: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో రూమర్లకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. చాలామంది వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి మరి గెలికేస్తున్నారు. ఏదో కామెడీ చేస్తే ఎవరు పెద్దగా పట్టించుకోరు కానీ, సొంత జీవితంలో వేలు పెట్టి గెలికితే ఎవరైనా రియాక్ట్ అవుతారు. ఆ విధంగానే స్టార్ క్రికెటర్ షమీ స్పందించారు. మరి ఆయన దేనికి స్పందించారు. ఆ వివరాలు చూద్దాం.
ఈ మధ్య కాలంలో చాలామంది స్టార్లు విడాకులు తీసుకొని విడిపోతున్నారు. దీంతో విడిపోయిన వాళ్ళందరికీ వేరొకరితో సోషల్ మీడియాలోనే పెళ్లిళ్లు చేసినంత పని చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు. తాజాగా సానియా మీర్జా క్రికెటర్ షమీ పెళ్లి అంటూ వార్త క్రియేట్ చేశారు. విపరీతంగా వైరల్ అయింది. దీంతో ఈ విషయం మహమ్మద్ షమీ దగ్గరికి వెళ్లిపోయింది. టీమిండియా స్టార్ పెసర్ మహమ్మద్ షమీ తన వైఫ్ ఆసిన్ జహాన్ తో విడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే తరుణంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాతో విడాకులు తీసుకున్నారు.
వారి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో నడుస్తున్న తరుణంలోనే మహమ్మద్ షమీ మరియు సానియా మీర్జాలు పెళ్లి చేసుకోబోతున్నారని ఒక వార్త సోషల్ మీడియాలో గట్టిగా వైరల్ అవుతుంది. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయిన షమీ నేటిజన్స్ ను ఏకిపారేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు గుర్తింపు లేని అకౌంట్లతో ఇలాంటి పోస్టులు చేస్తూ మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని, మీకు దమ్ముంటే ఒరిజినల్ అకౌంట్ల ద్వారా ఇలాంటివి రాయండి అప్పుడు నా తడాఖా ఏంటో చూపిస్తాను అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. పెళ్లి లేదు తొక్క లేదు అంటూ రూమర్లకు చెక్ పెట్టేసాడు.