ట్రంప్ పై కాల్పులు.. వీడియో తీసిన ఉగాండా చిన్నారులు.!

అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఈమధ్య పెన్సిల్వేనియాలో  ఒక సభలో పాల్గొని మాట్లాడుతుండగా ముష్కరులు హఠాత్తుగా దాడి చేశాడు. ఈ దాడిలో ట్రంపు చెవి భాగంలో గాయాలయ్యాయి.ఘటన అమెరికా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు.అయితే ఇదే వీడియోను అచ్చు గుద్దినట్టు ఉగాండా చిన్నారులు చేసి చూపించారు. ట్రంప్ లాగే ఒక చిన్నారి మాట్లాడుతూ ఉండగా  కాల్పులు జరుగుతాయి. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది తనను చుట్టుముట్టి తీసుకెళ్తుంటే ట్రంప్ ఏ విధంగా అభివాదం చేశాడో, ఆ చిన్నారి కూడా అలాగే అభివాదం చేస్తూ ఉన్నటువంటి వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.  అంతేకాదు ఆ చిన్నారుల చేతిలో చెక్కలతో తయారుచేసిన తుపాకులు ఆకారం ఉన్నటువంటి వాటిని పట్టుకొని  అచ్చం సెక్యూరిటీ సిబ్బంది లాగే  నటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ  కామెంట్లు పెడుతున్నారు.


Published Jul 18, 2024 11:40:00 AM
postImages/2024-07-18/1721280442_trump.jpg

న్యూస్ లైన్ డెస్క్: అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఈమధ్య పెన్సిల్వేనియాలో  ఒక సభలో పాల్గొని మాట్లాడుతుండగా ముష్కరులు హఠాత్తుగా దాడి చేశాడు. ఈ దాడిలో ట్రంపు చెవి భాగంలో గాయాలయ్యాయి. వెంటనే అలర్ట్ అయినటువంటి సిబ్బంది ట్రంప్ ను ఆ ప్రమాదం నుంచి కాపాడి ఆసుపత్రికి తరలించారు.  ఘటన అమెరికా వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అయింది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా స్పందించారు.

ట్రంప్ స్టేజ్ పై నిలుచొని మాట్లాడుతున్న సమయంలో సడన్ గా 6 రౌండ్ల  కాల్పులు జరిపారు. ఇందులో రెండవ రౌండ్  బుల్లెట్లు ట్రంప్ చేయి పక్కనుంచి వెళ్లడంతో చెవికి కాస్త గాయం అయింది, వెంటనే అలర్ట్ అయినటువంటి ట్రంప్ తాను మాట్లాడే పోడియం కిందికి వంగిపోయారు. తర్వాత మరో నాలుగు రౌండ్లు దుండగుడు కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ సిబ్బంది  వచ్చి ట్రంప్ ను కాపాడారు. ఆ తర్వాత ముష్కరున్ని కూడా పట్టుకొని కాల్చి చంపారు.  

అయితే ఈ వీడియో విపరీతంగా  వార్తల్లో, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రంప్ మాట్లాడుతుండడం ఆయనపై కాల్పులు జరపడం ఆయన తీసుకెళ్తుంటే ప్రజలకు అభివాదం చేయడం ఇదంతా వార్తల్లో చూపించారు. అయితే ఇదే వీడియోను అచ్చు గుద్దినట్టు ఉగాండా చిన్నారులు చేసి చూపించారు. ట్రంప్ లాగే ఒక చిన్నారి మాట్లాడుతూ ఉండగా  కాల్పులు జరుగుతాయి.

వెంటనే సెక్యూరిటీ సిబ్బంది తనను చుట్టుముట్టి తీసుకెళ్తుంటే ట్రంప్ ఏ విధంగా అభివాదం చేశాడో, ఆ చిన్నారి కూడా అలాగే అభివాదం చేస్తూ ఉన్నటువంటి వీడియో విపరీతంగా వైరల్ అవుతుంది.  అంతేకాదు ఆ చిన్నారుల చేతిలో చెక్కలతో తయారుచేసిన తుపాకులు ఆకారం ఉన్నటువంటి వాటిని పట్టుకొని  అచ్చం సెక్యూరిటీ సిబ్బంది లాగే  నటించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీనిపై నేటిజన్స్ రకరకాలుగా స్పందిస్తూ  కామెంట్లు పెడుతున్నారు.

https://x.com/kunley_drukpa/status/1813587084869021745?s=19

newsline-whatsapp-channel
Tags : newslinetelugu america donald-trump uganda pennsylvania

Related Articles