Viral Video: వార్ని ఇదేం బర్త్ డే పార్టీ రా...కాసేపు ఆగితే డెత్ డే అయ్యేది !

అయినా ప్రాంక్ అని వాళ్లు ఫీలయ్యి పోస్ట్ చేస్తారు మనం అవి ప్రాంక్ అని ఫీలయ్యి చూస్తున్నాం. బర్త్ డే పార్టీలో వెరైటీ రీల్స్ చేసిన ఓ యువకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. 


Published Feb 18, 2025 08:29:00 PM
postImages/2025-02-18/1739891071_firecrackerinthecake.webp

న్యూస్  లైన్ , స్పెషల్ డెస్క్: సోషల్ మీడియాలో ప్రాంక్ వీడియోస్ కి కొదవా చెప్పండి. రాత్రి కి రాత్రే ఫేమస్ అయిన వారు లక్షల్లో ఉన్నారు. కొంతమందైతే వాళ్లు కావాలనే చేస్తున్నారనే విషయం తెలిసిపోతుంది. అయినా ప్రాంక్ అని వాళ్లు ఫీలయ్యి పోస్ట్ చేస్తారు మనం అవి ప్రాంక్ అని ఫీలయ్యి చూస్తున్నాం. బర్త్ డే పార్టీలో వెరైటీ రీల్స్ చేసిన ఓ యువకుడు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యాడు. 


సోషల్ మీడియా వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేయడం లో మనవాళ్లు దిట్ట. అయితే వీడియో కి కంటెంట్ దొరికిందని ఓ వ్యక్తి తన వైఫో, అక్కో , చెల్లో ఎవరో ఓ లేడీ బర్త్ డే ప్లాన్ చేశాడు.  కేక్ , జనాలు హంగామా అంతా సెటప్ బాగుంది కాని .. క్యాండిల్ ఆగిపోతుందనగా కేక్ ఫట్ మని పేలిపోయింది. దీంతో అక్కడ జనాలంతా ఒకటే పరుగు. ఇక ఈ వీడియోను ప్రాంక్ వీడియో అని పోస్ట్ చేశారు. ఇక నెటిజన్ల తిట్లు వినాలి. ఏం ప్రాంకులు రా ఇవి అని కొందరు. పక్కనున్న ఆవిడకి యాక్టింగ్ నేర్పించండి. ఆవిడ ముందే యాక్ట్ చేసేస్తుందని కొందరు ...ఇలా కామెంట్లు పెడుతున్నారు.


మీరు చూసిన ఈ వీడియోను @sk465g అనే ఖాతా ద్వారా X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు. వీడియోను పోస్ట్ చేస్తున్నప్పుడు,’కేక్‌ను అబ్దుల్ ఫ్యాక్టరీ నుండి ఆర్డర్ చేసినట్లు కనిపిస్తోంది’ క్యాప్షన్‌లో ఉంది. కాగా, ఇప్పటికే చాలా మంది ఆ వీడియోను చూశారు. 


 

Related Articles