దీంతో BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: సిద్దిపేటలో అర్ధరాత్రి హైడ్రామా జరిగింది. మాజీ మంత్రి, సిద్ధిపేట BRS ఎమ్మెల్యే హరీష్‌రావు రాజీనామా చేయాలని ఆయన క్యాంప్ ఆఫీసు వద్ద ఫ్లెక్సీలు ప్రత్యేక్షం అయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆందోళన కారులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా హరీష్ రావు క్యాంప్ కార్యాలయం దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఫ్లెక్సీలను తొలగించేందుకు BRS కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. దీంతో BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే, దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించారని వార్తలు వినిపిస్తున్నాయి.