మనం ఏ వర్క్ చేసిన ఎంత ఎదిగినా సరే నోటిని కాపాడుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది. ఇక నోటి దూల ఉంటే మాత్రం తప్పక వివాదాలు చుట్టుముడతాయి. సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా ఉంటుంది.
న్యూస్ లైన్ డెస్క్: మనం ఏ వర్క్ చేసిన ఎంత ఎదిగినా సరే నోటిని కాపాడుకుంటే అంతా సవ్యంగా ఉంటుంది. ఇక నోటి దూల ఉంటే మాత్రం తప్పక వివాదాలు చుట్టుముడతాయి. సినిమా ఇండస్ట్రీలో ఇది ఎక్కువగా ఉంటుంది. కాస్త స్టార్ డం ఉంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చివరికి అదో గతి పడుతుంది. అలా ఈ తంగలాను బ్యూటీ కూడా అనేక వివాదాల్లో చిక్కుకుందట. అయినా ఆమె సినిమాల్లో దూసుకుపోతోంది. ఆ వివరాలు ఏంటో చూద్దాం.. తంగలాన్ చిత్రంలో హీరోయిన్ గా చేసిన కథానాయక పేరు పార్వతి తిరువత్తు.
2006 నుంచి ఇండస్ట్రీలో మంచి పేరుతో దూసుకుపోతున్న ఈ అమ్మడు అనేక చిత్రాల్లో నటించింది. ఓటీటీలు ఎప్పుడైతే మనకు అందుబాటులోకి వచ్చాయో అప్పటినుంచి అభిమానులకు మరింత దగ్గర అయిందని చెప్పవచ్చు. అయితే ఈమె తాజాగా తంగలాన్ చిత్రంలో డి గ్లామర్ పాత్రలో అద్భుతంగా నటించింది. నటిగా ఈమెను ఏ కోణంలో కూడా తప్పు పట్టడానికి లేదు, కానీ ఈమె చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయట. అయితే గతంలో ఈమె మలయాళ చిత్ర సీమలో హీరో హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పారితోషకం విషయంలో వ్యత్యాసాలు ఎందుకు చూపిస్తారని ప్రశ్నించింది. మమ్ముట్టి వంటి స్టార్ హీరోనే నేను డైరెక్టుగా ప్రశ్నించింది. కేరళలో జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్ లో మాట్లాడుతూ మహిళలను కించపరిచే సీన్స్ సినిమాల్లో ఉంటున్నాయని డైరెక్ట్ గా చెప్పింది.
2020లో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ నుంచి వైదొలిగింది. దీనికి కారణం అసోసియేషన్ కు చెందిన ఎడవెల బాబు మహిళలపై దారుణంగా కామెంట్లు చేస్తారని, అతని చెంపలపై అటు ఇటు కొట్టి పూర్తిగా బయటకు వచ్చింది. అంతేకాకుండా సెన్సార్ బోర్డు వాళ్లు కూడా పకడ్బందీగా ఉండాలని వారికి కౌంటర్ ఇచ్చింది. ఈ విధంగా ఈమె ఎన్నో వివాదాల్లో చిక్కుకొని సినిమా ఇండస్ట్రీలో మాత్రం దూసుకుపోతోంది. తాజాగా తంగలాన్ చిత్రంతో మన ముందుకు రావడంతో ఈమె పాత వివాదాలు సోషల్ మీడియాలో మరోసారి వైరల్ అవుతున్నాయి.