ఈ ఫోటోలోని యువతి  స్టార్ హీరో కూతురు..అందం చూస్తే.?

పైన ఫోటోలో రోజాతో ఒక అమ్మాయి నిలబడి ఉంది. చూడటానికి కుందనపు  బొమ్మలా ఉంది. ఆ అమ్మాయినీ చూసి చాలామంది రోజా కూతురు అనుకుంటారు. అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే.


Published Aug 24, 2024 12:01:08 PM
postImages/2024-08-24/1724481068_naveen1.jpg

న్యూస్ లైన్ డెస్క్: పైన ఫోటోలో రోజాతో ఒక అమ్మాయి నిలబడి ఉంది. చూడటానికి కుందనపు  బొమ్మలా ఉంది. ఆ అమ్మాయినీ చూసి చాలామంది రోజా కూతురు అనుకుంటారు. అలా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టే. రోజా కూతురు కాదట  ఆమె తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోగా వెలుగు వెలిగిన  హీరో కూతురట. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే  వడ్డే నవీన్. ఒకప్పుడు ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ హిట్లతో  అందరి మదిని దోచాడు.

తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న ఆయన కథలో పొరపాట్లు కారణంగా ఫెడవుట్ హీరోగా మారిపోయాడు.  అలాంటి నవీన్ సినిమాలకు ఎప్పుడైతే దూరమయ్యాడో, వ్యాపార రంగంలో అడుగు పెట్టి రాణిస్తున్నారు. అయితే నవీన్ చెలికాడు, ప్రియా ఓ ప్రియా, తాంబూలాలు , పెళ్ళాడి చూపిస్తా వంటి చిత్రాలలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత కొన్నాళ్లు గ్యాప్ ఇచ్చి మనసిచ్చి చూడు, స్నేహితుడు వంటి చిత్రాలు చేసి విజయాన్ని అందుకున్నాడు.

కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. 2016 నుంచి నవీన్ ఇండస్ట్రీలో కనిపించడం లేదు. ఎన్టీఆర్ కొడుకు రామకృష్ణ కూతురు చాముండేశ్వరిని పెళ్లి చేసుకొని కొన్నాళ్ల తర్వాత విడిపోయారు. ఆ తర్వాత మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.  వీరికి ఒక పాప, ఒక బాబు పుట్టారు.అయితే కొన్నాళ్ల కింద తన బాబు పంచ కట్టు  ఫంక్షన్ లో టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై వారి కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగారు. ఈ క్రమంలోనే రోజాతో తన కూతురు దిగిన ఫోటో ఉంది.  సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నవీన్ కూతురు ఇంత పెద్దదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu roja sr-ntr marraige vadde-naveen daughter

Related Articles