ఇప్పుడు గ్రాము బంగారం ధర 9700 నడుస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లోను ఇదే బంగారం ధర నడుస్తుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : అక్షయతృతీయ ముందు బంగారం కొనే వారికి శుభవార్త అనే చెప్పాలి. అంతర్జాతీయంగా బలహీనమైన సంకేతాల మధ్య ఢిల్లీ బులియన్ మార్కెట్లో బంగారం ధర 10 గ్రాములకు రూ. 1000 తగ్గింది. దీనితో పాటు 99.5% స్వఛ్ఛత కలిగిన బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 1000 తగ్గి రూ. 97,900 చేరుకుంది. వెండి అయితే చాలా తగ్గుతుంది. కిలో వెండి ధర రూ.1,400 తగ్గి రూ.98,500కి చేరుకుంది. అమెరికా -చైనా వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం , డాలర్ బలపడడం వల్ల సురక్షితమైన పెట్టుబడిగా బంగారం డిమాండ్ తగ్గింది. అయితే ఇప్పుడు గ్రాము బంగారం ధర 9700 నడుస్తుంది. దేశంలో అన్ని ప్రాంతాల్లోను ఇదే బంగారం ధర నడుస్తుంది.