TOLLYWOOD: టాలీవుడ్ సినిమాలు ఏ సినిమా ఎక్కడ షూటింగ్ జరుగుతుంది ?

అసలు చాలా మందికి ఏ సినిమా లు ప్రాసెస్ లో ఉన్నాయో కూడా తెలీదు.  అసలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతుందో తెలుసుకుందాం.


Published Sep 16, 2024 07:56:00 PM
postImages/2024-09-16/1726496943_images.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తెలుగు ఇండస్ట్రీ లో బోలెడు సినిమాలు షూటింగులు జరుగుతున్నాయి. కొన్ని షూట్ స్టార్ట్ అయ్యాయి. కొన్ని సినిమా లు ఇంకా మధ్యలో ఉన్నాయి. అసలు చాలా మందికి ఏ సినిమా లు ప్రాసెస్ లో ఉన్నాయో కూడా తెలీదు.  అసలు పెద్ద సినిమాలు చిన్న సినిమాలు ఏ సినిమా ఎక్కడ షూట్ అవుతుందో తెలుసుకుందాం.


* ప్రభాస్.. హను రాఘవపూడి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ. ఈ చిత్ర‌ షూటింగ్ కరైకుడిలో జరుగుతుంది. ప్రభాస్ ఫ్యాన్స్ కల్కి హిట్ తో పూనకాల్లో ఉన్నారు. ఈ సినిమా మరింత బూస్టింగ్ గా ఉంటుందని టాక్.


* బాబీ డైరెక్షన్ లో బాలకృష్ణ నటిస్తున్న సినిమా షూటింగ్ చౌటుప్ప‌ల్‌లో జరుగుతుంది. ఇది కూడా మంచి మాస్ మూవీ..బాలయ్య కూడా ఈ సారి కూడా మంచి సూపర్ హిట్టవుతుందని టీం అంచనా.


* నాగార్జున ధనుష్ కాంబోలో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న సినిమా కుభేర షూట్ హైదరాబాద్ లో నే సెట్ వేసి చేస్తున్నారు. సార్ అటు బిగ్ బాస్ ను ఇటు సినిమా షూట్ ను బ్యాలెన్స్ చేస్తున్నారు.


* విజయ్ దేవరకొండ గౌతం తిన్నసూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. ఈ షూట్ కూడా చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. దాదాపు లాస్ట్ స్టేజ్ లో ఉందని టాక్ .


* సాయిధరంతేజ్ హీరోగా రోహిత్ కేపీ దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది.
* జొన్నలగడ్డ సిద్దు, నీరజ కోన దర్శకత్వంలో వస్తున్న కోంపల్లి లో జరుగుతుంది.


* వరుణ్ తేజ్ కరుణకుమార్ డైరెక్షన్ లో వస్తున్న మట్కా కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu secundrabad tollywood release movies

Related Articles