GOAT: విజయ్ 'గోట్' నుంచి స్పార్క్ సాంగ్

శనివారం మూవీయూనిట్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ స్పార్క్‌ను విడుదల చేశారు. 


Published Aug 03, 2024 08:39:52 AM
postImages/2024-08-03/1722692227_spark2.PNG

న్యూస్ లైన్ సినిమా:  త‌మిళ‌ స్టార్ హీరో దళపతి విజయ్ న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ మూవీకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తుండ‌గా.. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి రిలీజైన ఫ‌స్ట్ లుక్, గ్లింప్స్‌ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. శనివారం మూవీయూనిట్ ఈ సినిమా నుంచి థర్డ్ సింగిల్ స్పార్క్‌ను విడుదల చేశారు.

స్పార్క్ అంటూ రొమాంటిక్‌గా సాగిన ఈ పాట‌ను యువన్ శంకర్ రాజా, వ్రశాల్ బాలు కలిసి పాడారు. రామ జోగయ్య స్త్రీ సాహిత్యం అందించిన ఈ పాట‌కు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు. ఏజీఎస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న ఈ సినిమాని కల్పతి ఎస్ అఘోరం నిర్మిస్తున్నాడు. వైభవ్, ప్రేమి అమరెన్, యుగేంద్రన్, ప్రశాంత్‌, ప్రభుదేవా, స్నేహ, లైలా, యోగిబాబు మిక్ మోహన్‌, జయరాం, కిచ్చా సుదీప్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : movie-news dalapathi-vijay cinema-news goat-of-all-time

Related Articles