Big Boss 8 : బిగ్ బాస్ లో హాట్ బ్యూటీ.. రచ్చ రచ్చేనా?

బిగ్ బాస్ సీజన్ 8 కి అంతా సిద్ధమైంది. మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కానున్న 8వ సీజన్ కి ఇప్పటికే హౌజ్ మేట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే.. ఈ జాబితాలో తాజాగా ఓ యంగ్ బ్యూటీ యూట్యూబర్ పేరు చేరింది. ఆమె ఎవరంటే..


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721313599_soniasinghbb.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఏడు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని త్వరలోనే 8వ సీజన్ తో ప్రారంభం అయ్యేందుకు సిద్ధంగా ఉంది బిగ్ బాస్ రియాలిటీ షో.  ఇప్పటికే వస్తున్న వార్తలతో ఈ సారి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ మీద ఆసక్తి పెంచేశారు. బిగ్ బాస్ హౌజ్ లో జరిగే గొడవలు.. కామెడీ, సీరియస్, ఓవర్ యాక్షన్, ఎంటర్ టైన్ మెంట్, డ్రామా అందించే ఫన్ అంతా ఇంతా కాదు. గత సీజన్ లో ఫైనల్ రోజు బిగ్ బాస్ 7 విజేత పల్లవి ప్రశాంత్ చేసిన హడావిడికి ఏకంగా అరెస్ట్ కావాల్సి వచ్చింది.

అదలా ఉంటే.. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 మీద రోజురోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈసారి హౌజ్ లోకి వెళ్లబోయేది వీరే అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కొన్ని పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో చాలామంది ముఖ పరిచయం ఉన్నవారే. బర్రెలక్క, కుమారీ ఆంటీ, యూట్యూబర్ బంచిక్ బబ్లూ, హేమ, సురేఖ వాణఇ, కిరాక్ ఆర్పీ, బుల్లెట్ భాస్కర్; వర్షిణి, రీతూ, అంబటి రాయుడు, వేణు స్వామి, అమృత ప్రణయ్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ జాబితాలో ఇప్పుడు కొత్తగా ఓ యూట్యూబర్.. అందాల ముద్దుగుమ్మ పేరు కూడా వినిపిస్తోంది.  

చాలా షార్ట్ ఫిలింస్ తో అలరించిన సోనియా సింగ్ బిగ్ బాస్ సీజన్ 8 లో ఎంట్రీ ఇవ్వనుందట. సాయిధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష సినిమాలో ఓ కీలక పాత్రలో సోనియా సింగ్ మెప్పించింది. రీసెంట్ గా శశి మథనం అనే ఓటీటీ సినిమాతో అలరించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో సోనియా సింగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో మరి.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu viral-news big-boss youtube big-boos8

Related Articles