aadya వార్తలు

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు రాజకీయాల్లో అడుగు పెట్టారు. కానీ ఇందులో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది మాత్రం ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.  ఇక ఆయన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి ఘనత సాధించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన పార్టీని స్థాపించి దాదాపు పది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి  2024 ఎలక్షన్స్ లో పార్టీని ఓ గాడిన పెట్టారు. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలకు 21 గెలుచుకొని తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్.  

చివరికి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా పొంది ప్రజాసేవలో లీనమైపోయాడు.  అలాంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారంలో ఉన్నప్పటి నుంచి  తన కొడుకు అకిరా నందన్ ను వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఎన్నడూ కూడా బయటకు రాని తన తండ్రి గెలుపులో కూడా పాత్ర వహించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అకిరాను మరియు తన కూతురు ఆధ్యాను కూడా తీసుకెళ్లారు. అలాగే చంద్రబాబు దగ్గర కూడా వీరిద్దరూ ఆయన వెంట ఉన్నారు.

ఈ విధంగా తాను చేసే ప్రతి పనిలో అకిరానందన్ ను

advertisement