tuni: తునిలో మళ్లీ హై టెన్షన్ ... ఇక మున్సిపల్ చైర్మన్ ఎన్నికలు జరిగినట్లే !

బారికేడ్లను దాటుకొని టీడీపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు లీఠీ ఛార్జ్ చేశారు.


Published Feb 18, 2025 02:30:00 PM
postImages/2025-02-18/1739869282_15Tunirural172a515b480vjpg.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తునిలో మరోసారి హై టెన్షన్ స్టార్టయ్యింది. ఇప్పటికే తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక మూడు సార్లు ఛైర్మన్ ఎన్నికను నిర్వహించనున్నారు. అయితే మరోసారి తుని మున్సిల్ ఛైర్మన్ ఎన్నికలను నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. వైసీపీ కౌన్సిలర్లు, మున్సిపల్ కార్యాలయానికి బయలుదేరారు. బారికేడ్లను దాటుకొని టీడీపీ కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు లీఠీ ఛార్జ్ చేశారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించారు.


గుంపులు గుంపులుగా మున్సిపల్ కార్యాయలానికి వెళ్లారు కూటమి కార్యకర్తలు. చాలా మంది వైసీపీ నేతలు తునికి రావాలని ప్రయత్నిస్తే పోలీసులు వారిని అడ్డుకున్నారు. బయటివాళ్లు ఎవ్వరూ కూడా రావద్దని నిన్ననే డీఎస్పీ సూచించారు. డీఎస్పీ సూచించినా వైసీపీ నేతలు తునికి రావడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకొని వారి ఇళ్లకు పంపించారు. వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. తుని మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu muncipalminister

Related Articles