అఫిషియల్ గా ఏపీ లో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయంటున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఏపీ లో గులియన్ బారే సిండ్రోమ్ ( GBS)కేసులు పెరుగుతుండడం అందోళన కలిగిస్తుంది. గుంటూరులోని జీజీహెచ్ లో ఓ మహిళ మృతి చెందడం అందోళను పెంచుతుంది.. అఫిషియల్ గా ఏపీ లో ఇప్పటి వరకు 17 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ సంఖ్య ఇంతకంటే ఎక్కువయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయంటున్నారు. ఇది అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు చెబుతున్నా ప్రజల్లో మాత్రం అసలు అందోళన తగ్గడం లేదు.
దీని పై జీబీఎస్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వ్యాధి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. వ్యాధి నిర్ధారణ పరీక్షలపై దృష్టి సారించాలని హాస్పటిల్ లో మెరుగైన సదుపాయాలు అందించాలని ఆదేశించారు. జీబీఎస్ పై అవగాహన కల్పించాలంటూ రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఆరోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు, ఆరోగ్యశాఖ్య సీనియర్ అధికారులు పాల్గొన్నారు.