ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గతేడాది నవంబర్ 2 , డిసెంబర్ 22 తేదీల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అనకాపల్లి జిల్లా ఫార్మా సిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి . దట్టంగా పొగ అలుముకోవడంతో చుట్టుప్రక్కల నివాసమున్న ప్రజలు తీవ్ర అందోళనకు గురయ్యారు. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాలేదని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గతేడాది నవంబర్ 2 , డిసెంబర్ 22 తేదీల్లో ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగాయి. మళ్లీ నెల రోజులు గడవకుండానే మరో అగ్ని ప్రమాదం జరగడం కలకలం రేపుతుంది.మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎఫ్లూయెంట్ ట్యాంక్ నుంచి మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. ప్రమాదంలో ఏం ప్రాణ నష్టం జరగకపోయినా ...భారీ గా మంటలు ఎగిసిపడడంతో జనాలు భయపడుతున్నారు.