TTD: తిరుమల మృతుల కుటుంబంలో ఒకరికి కాంట్రాక్టు ఉద్యోగం !

చిన్న చిన్న గాయాలపాలయిన వారికి 2 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న వారికి రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామని తెలిపారు.


Published Jan 09, 2025 06:55:00 PM
postImages/2025-01-09/1736429147_6714e9b7e98a5andhrapradeshchiefministernchandrababunaidu19102057016x9.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  తిరుపతి తొక్కిసలాటలో మృతుల కుటుంబాల్లో ఒకరికి పక్కాగా కాంట్రాక్టు ఉద్యోగం ఇస్తామని తెలిపారు సీఎం చంద్రబు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వనుండగా ...తీవ్రంగా గాయపడిన వారికి 5 లక్షలుఇస్తామని తెలిపారు . చిన్న చిన్న గాయాలపాలయిన వారికి 2 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. హాస్పటిల్ లో చికిత్స పొందుతున్న వారికి రేపు ప్రత్యేకంగా వైకుంఠ దర్శనం కల్పిస్తామని తెలిపారు.


తిరుపతిలో తొక్కిసలాట ఘటన తన మనస్సు పూర్తిగా కలచివేసిందని సీఎం చంద్రబాబు అన్నారు. శ్రీవారి సన్నిధిలో ఎప్పుడూ ఎలాంటి అపచారాలూ జరగకూడదని తెలిపారు. పవిత్రమైన పుణ్యక్షేత్రంగా దీనిని ఎప్పుడూ కాపాడాలని భక్తుడిగా ఒక సీఎంగా ఆలయ పవిత్రతను కాపాడే బాధ్యతను ఎప్పుడూ తీసుకుంటానన్నారు. అయితే తిరుమల వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజుల పాటు జరపడాన్ని సీఎం చంద్రబాబు వ్యతిరేకించారు.
 

newsline-whatsapp-channel
Tags : chandrababu newslinetelugu job ttd tirumala

Related Articles