రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో భక్తులు భారీగా తిరుమల చేరుకున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తిరుమలకు వెళుతున్న భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ క్రమంలో అలిపిరి వద్ద ఉన్న సప్తగిరి టోల్ ప్లాజా వద్ద భారీగా వాహనాలు బారులు తీశాయి. ఈ క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. రేపటితో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ముగియనుండటంతో భక్తులు భారీగా తిరుమల చేరుకున్నారు.
ఈరోజు, రేపు దర్శనాలకు సంబంధించి 50 వేల టోకెన్లను టీటీడీ ముందస్తుగా జారీ చేసింది. లైన్ లో వేల ప్రత్యేక దర్శనం టికెట్లను కూడా జారీ చేసింది.రోజుకు 70 వేల మందికి వైకుంఠ దర్శనం కల్పించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అయినా భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఈ రోజు అర్ధరాత్రితో వైకుంఠ ద్వార దర్శనం ముగుస్తుంది. స్వామి వారి దర్శనానికి దాదాపు 48 గంటలు పట్టే అవకాశముందని అంచనావేస్తున్నారు అధికారులు .