దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆగ్నేయ బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమవాయువ్యదిశగా కదులుతూ మరింతగా బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం రాత్రికి శ్రీలంక -తమిళనాడు తీరాలకు చేరే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ నెల 15వ తేదీ వరకు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. వర్షాలు నేపధ్యంలో కుప్పలు వేసేటప్పుడు ఎకరాలకు 25 కిలోల ఉప్పును పనలపై చల్లుకుంటూ కుప్ప వేసుకోవడం వల్ల నష్ట శాతాన్ని నివారించుకోవచ్చని సూచించింది.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతోంది. ధాన్యం తడవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ధాన్యపు రాశులు వానకు తడవకుండా సమీప రైస్ మిల్లులకు తరలించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అవసరమైతే టార్పాలిన్లను రైతులకు సమకూర్చాలని జిల్లా కలక్టర్లు ఆదేశాలిచ్చారు.