బ్రిటషర్స్ చెప్పేదే నిజం అనుకుంటాం. అయితే ఆ రాజుల పాలన, కైంకర్యాల వివరాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.
న్యూ స్ లైన్, స్పెషల్ డెస్క్: రాజుల సొమ్ము రాళ్ళపాలు అంటారు… అయితే అది దేవాలయాల నిర్మాణాల విషయంలో కాదు… అందుకు ఇప్పటికీ ఆనాటి రాజుల ఘనతను తెలియచేసే విలువైన శాసనాలే ఇందుకు నిదర్శనం. ఆ శాసనాలే లేకపోతే ...ఇంకా బ్రిటషర్స్ చెప్పేదే నిజం అనుకుంటాం. అయితే ఆ రాజుల పాలన, కైంకర్యాల వివరాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి.
విజయనగర రాజుల కాలంలో సామ్రాజ్య విస్తరణలో భాగంగా తాము జయించిన రాజ్యాలలో దేవాలయాలను నిర్మించి శిలాశాసనాలను ఏర్పాటు చేసేవారు… అప్పట్లో ఈ శిలాశాసనాల ద్వారానే రాజుల విజయగాధలు, వారు జయించిన రాజ్యాలు, రాజుల వివరాలు శాసనాలపై లిఖించేవారు…రోజులు గడిచే కొద్ది ఆశాసనాలు మరుగునపడతాయి. అయితే తాజాగా ప్రకాశం జిల్లాలో బేస్తరి వారి పేటలో ఓ ఆలయంలో విజయనగరరాజుల కాలంలో ఏర్పాటు చేసిన ఓ శాసనం వెలుగులోకి వచ్చింది.
బసినేపల్లి – చెరుకుపల్లి గ్రామాల మధ్య ఏకరాతితో నిర్మించిన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో 15వ శతాబ్దం కాలంలో నిర్మించిన శాసనం వెలుగు చూసింది. చెరుకుపల్లిలోని అహోబిలేశ్వర స్వామి ఆలయ నిర్వహణకు కొన్ని భూములను ఇచ్చారు… 1502 కాలంలో ఈ భూములను కేటాయించినట్టు శాసనంలో లిఖించి ఉంది… ఈ విషయాన్ని తెలుపుతూ నాగ శాసనం ఏర్పాటు చేశారట. ఆ విషయాన్ిన ఆలయ అధికారి కన్ఫర్మ్ కూడా చేశారు.. ఆలయంలో ఉన్న వీరాంజనేయ స్వామితో పాటు ఆలయం మొత్తం రాతితో ఉండడం ఈ ఆలయం అందర్నీ ఆకర్షిస్తుంది. అంతేకాదు 15వ శతాబ్ధంలో కట్టిన దేవాలయం పూర్వ వైభవాన్ని సంతరించుకుంది.