Landslide: తుఫాను ఎఫెక్ట్ ..తిరుమలలో విరిగిపడ్డ కొండచరియలు !

టీటీడీ అధికారులు రెస్పాండ్ అయ్యారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా టీటీడీ జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తుంది.


Published Dec 01, 2024 06:07:00 PM
postImages/2024-12-01/1733056715_images1.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగాళాఖాతంలో ఫెయింజల్ తుఫాను గత రాత్రి తీరం దాటింది. దీని ప్రభావంతో తమిళనాడు, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం వల్ల ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలో తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తిరుమల రెండో ఘూట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. వెంటనే టీటీడీ అధికారులు రెస్పాండ్ అయ్యారు. రాకపోకలకు అంతరాయం కలగకుండా టీటీడీ జేసీబీలతో బండరాళ్లను తొలగిస్తుంది.


ఫెయింజల్ తుపాను గత రాత్రి 10.30 గంటల నుంచి 11.30 గంటల మధ్య కారైక్కాల్-మహాబలిపురం మధ్య తీరాన్ని దాటింది. ప్రస్తుతం ఇది చెన్నైకి దక్షిణ, నైరుతి దిశగా 120 కిమీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.  అయితే దీని ప్రభావంతో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.


ఆరుగంటలుగా ..ఫెయింజల్ తుఫాన్  పశ్చిమ దిశగా పయనిస్తోందని, క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా  మారిందని భారత వాతావరణ సంస్థ వెల్లడించింది. దీని వల్ల రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu landing tirumala

Related Articles