న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: శ్రీవారి భక్తులకు మరింత టేస్టీ భోజనం అందించాలనుకుంటుంది టిటిడీ. అన్నప్రసాదం మెనూలో అదనంగా మరో ఐటమ్ ను పెంచాలని ఫిక్స్ అయ్యారు టీటీడీ ఛైరన్ బీ ఆర్ నాయుడు. అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మెనూలో మార్పులు చేశారు. కొత్తగా మసాలా వడలు వడ్డించాలని నిర్ణయించారు.
ట్రయల్ రన్ లో భాగంగా నేడు ఐదు వేల మసాలా వడలను భక్తులకు వడ్డించారు. ఉల్లి , వెల్లుల్లి లేకుండానే ఈ మసాలా వడలు తయారుచేశారు. కాని కొన్ని రోజుల పాటు పరిశీలించిన తర్వాత లోటు పాట్లను సవరించుకొని పూర్తి స్థాయిలో మెనూకి రూపకల్పన చేయనున్నారు. ఈ మేరకు టిటిడీ కసరత్తులు చేస్తుంది. త్వరలోనే వడలతో కూడిన కొత్త మెనూను టిటిడీ చైర్మన్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.