శనివారం కిలో వెండి ధర రూ.92,800 ఉండగా, సోమవారం నాటికి రూ.109 పెరిగి రూ.92,909కు చేరుకుంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: దేశంలో బంగారం వెండి ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. శనివారం 10 గ్రాముల బంగారం ధర రూ. 81,840 ఉండగా , సోమవారం నాటికి రూ. 140 తగ్గి రూ.రూ.81,700కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.92,800 ఉండగా, సోమవారం నాటికి రూ.109 పెరిగి రూ.92,909కు చేరుకుంది.
గత కొంత కాలం నుంచి పసిడి ధరలు బ్రేకుల్లేకుండా పరుగులు పెరుగుతూనే ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.81వేల మార్క్ దాటింది. నిజానికి ట్రంప్ అధికారంలోకి వచ్చాక బంగారం ధరలు తగ్గుతాయని చాలా ప్రచారం జరిగింది. కాని బంగారం ధర పెరగడమే కాని తగ్గదని తెలిసిపోయింది.
సోమవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.74,340, 24 క్యారెట్ల పసిడి ధర రూ.81,100 గా ఉంది. వెండి కిలో ధర రూ.96,400 లుగా ఉంది. బంగారంపై రూ.10 మేర.. వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. ఫ్యూచర్ లో మరింత రేట్లు పెరిగే అవకాశముందంటున్నారు.