రీల్స్ చేసి లైక్స్, ఫాలోవర్స్ నుం పెంచుకోవాలని డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. అలా చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. ఇప్పటికీ కొందరు మారడం లేదు.
న్యూస్ లైన్ డెస్క్: ఏ పని చేసినా సెల్ఫీ, వీడియో, రీల్స్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఇప్పడు పెద్ద అలవాటుగా మారిపోయింది. యువత రీల్స్ కు అలవాటు పడి.. పక్కన ఉన్న వారి కన్నా సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇక ఎక్కడికైనా టూర్ కి వెళ్తే.. చక్కగా ఆస్వదించకుండా.. సెల్ఫీలు వీడియోలు అంటూ రోబోల్లా జీవిస్తున్నారు. మరి కొంత మంది అయితే, రీల్స్ పిచ్చితో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. రీల్స్ చేసి లైక్స్, ఫాలోవర్స్ నుం పెంచుకోవాలని డేంజర్ స్టంట్స్ చేస్తున్నారు. అలా చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఎన్నో జరుగుతున్నా.. ఇప్పటికీ కొందరు మారడం లేదు.
ఇలాంటి ఘటనే ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఓ యువతి సెల్ఫీ సరదా..ఏకంగా ప్రాణాలు తీసేంత పని చేసింది. మహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాట్‌కు వెళ్లిన స్నేహితులు అక్కడి లోయ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, సెల్ఫీ తీసుకుంటుండగా.. ప్రమాదవశాత్తూ ఓ యువతి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. దీంతో ఆమె స్నేహితులు వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు.. రెస్క్యూ టీంతో అక్కడికి చేరుకున్నారు. తాళ్ల సహాయంతో యువతిని పైకి తీసుకొని వచ్చారు. తీవ్రంగా గాయపడిన యువతిని వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.