బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ. భైరవ ద్వీపం లాంటి మూవీస్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. చెన్నైలో ఓ హాస్పటిల్ లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్ లో ఓ సినిమా ఘూటింగ్ లో గాయపడ్డ విజయరంగరాజు ట్రీట్మెంట్ కోసం చెన్నై వెళ్లారు. రంగరాజుకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తెలుగు, తమిళ సినిమాల్లో విలన్, సహాయ పాత్రల్లో అలరించారు రంగరాజు. బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ రంగరాజుకు నటుడిగా ఫస్ట్ మూవీ. భైరవ ద్వీపం లాంటి మూవీస్ చేస్తూ తెలుగు ఆడియన్స్ కు దగ్గరయ్యారు.
‘యజ్ఞం’ సినిమాతో పాటు తెలుగు , కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో రంగరాజుకు చాలా మంచి ప్రావీణ్యం ఉంది.అయితే చాలా రోజుల క్రితం కన్నడ సూపర్ స్టార్ విష్ణువిర్ధన్ గురించి అనుచిత కామెంట్లు చేసి నెట్టింట ట్రోల్ అయ్యారు.
అప్పుడు విష్ణువర్ధన్ అభిమానులే కాదు కన్నడ స్టార్ హీరోలు కూడా రంగరాజుపై ఫుల్ ఫైర్ అయ్యారు. కిచ్చా సుదీప్ , దర్శన్ , పునీత్ రాజ్ కుమార్ , యశ్ లాంటి వారు రంగరాజన్ మీద చెయ్యి చేసుకున్నారనే టాక్ కూడా ఉంది. దీంతో తప్పు తెలుసుకున్న రంగరాజు తాను తప్పు చేశానని బోరున ఏడుస్తూ క్షమాపణలు చెప్పారు.