viral : బాయ్ ఫ్రెండ్ ను చంపిన అమ్మాయికి ఉరిశిక్ష విధించిన కోర్టు !

కూల్‌డ్రింక్‌లో వి షం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపిన కేసులో ఈ రోజు కోర్టు అంతిమ తీర్పు వెలువరించింది. 


Published Jan 20, 2025 05:05:00 PM
postImages/2025-01-20/1737372945_sharongreeshmaphoto.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  ఇండియాలో ఆడవాళ్లకే న్యాయం జరుగుతుంది. మగవారికి ఏం జరిగినా న్యాయం జరగదు. ఇదే మాట అంటూ ఉంటారు. అయితే ఈ కేసుతో కేరళ కోర్టు ఇలాంటి వారి నోరు మూయించింది. బాయ్ ఫ్రెండ ను చంపిన కేసులో యువతి గ్రీష్మకు ఉరిశిక్ష విధస్తూ కేరళలోని తిరువనంతపురం కోర్టు సంచలన తీర్పు నిచ్చింది. కూల్‌డ్రింక్‌లో విషం కలిపి బాయ్‌ఫ్రెండ్‌ను గ్రీష్మ చంపిన కేసులో ఈ రోజు కోర్టు అంతిమ తీర్పు వెలువరించింది. 


ప్రధాన నిందితురాలు గ్రీష్మాకు మరణశిక్ష విధిస్తూ నెయ్యట్టింకర అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఏఎం బషీరిన్ తీర్పు ఇచ్చారు.  నిర్మలా కుమారన్ నాయర్ గ్రీష్మ మామయ్య, తనే ఆ వ్యక్తిని చంపడానికి సహకరించాడు . అందుకే నిర్మలా కుమారన్ కు మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. ఈ కేసులో రెండో నిందితురాలిగా ఉన్న గ్రీష్మ తల్లిని సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు వదిలేసింది. ఈ మేరకు కోర్టు శిక్షను ఖరారు చేసింది.


ఈ కేసులో వేగంగా దర్యాప్తు చేసినందుకు కేరళ పోలీసులను కోర్టు ప్రశంశించింది. కోర్టు 586 పేజీల తీర్పును ఈ సందర్భంగా వెలువరించింది. ఇది అరుదైన కేసని ...దీని వల్ల ఆమె వయస్సు ను పరిగణలోకి తీసుకోలేమని మరణ శిక్ష విధించినట్లు తీర్పు లో చెప్పింది. తీర్పు విన్న తర్వాత గ్రీష్మా ఎలాంటి రియాక్షన్ లేకుండా కోర్టులో నిలబడి ఉన్నట్లు అధికారులు తెలిపారు.


2022వ సంవత్సరం అక్టోబరు 14న షారన్ రాజ్‌ (23)ని అతడి గర్ల్‌ ఫ్రెండ్ గ్రీష్మ తన పుట్టిన రోజు సందర్భంగా.. చీరాలో తన ఇంటికి పిలిచింది. అక్కడ ఆమె పారాక్వాట్ అనే హెర్బల్ మెడిసిన్ ను కూల్ డ్రింక్ లో కలిపి తాగించింది . దీని తర్వాత తీవ్ర వాంతులు, శారీరక సమస్యలతో ఆసుపత్రిలో చేరిన షారన్ 11 రోజుల పాటు మృత్యువుతో పోరాడి అదే ఏడాది అక్టోబర్ 25న ఆస్పత్రిలో మరణించాడు. నిజానికి మృతుడు షారన్ నెయూర్ సోదరుడు ఓ ఆయుర్వేద డాక్టర్. అతను ఈ కేసును ఛేధించాడు. తనే తన తమ్ముడి మరణానికి హెర్బిసైడ్ పారాక్వాట్ అనే విషం కారణమని ..అది గ్రీష్మ ఇచ్చిందని తెలిపారు. గ్రీష్మకు తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి ఇష్టం లేదు. తనను వదిలించుకొని మరో వ్యక్తిని పెళ్లిచేసుకోవడానికి బాయ్ ఫ్రెండ్ ను తప్పించింది.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu kerala court

Related Articles