ఫిబ్రవరి 7 న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా మీద మంచి బజ్ ఉంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : నాగచైతన్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ తండేల్ . కార్తీకేయ2 ఫేమ్ డైరక్టర్ చందూ మొండేటి డైరక్షన్ లో వస్తున్న ఈ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. కొన్ని నెలలుగా షూటింగ్ పనులు అవుతున్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 7 న అడియన్స్ ముందుకు తీసుకువస్తున్నారు. సినిమా మీద మంచి బజ్ ఉంది.
ఈ సినిమా మత్యకారుల నేపథ్యంలో తెరకెక్కుతోంది. యదార్ధసంఘటన ఆధారంగా చందూ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని తెలుస్తుంది. సాయిపల్లవి జోడీ గా వస్తున్న ఈ సినిమా పై చాలా అంచనాలున్నాయి. అయితే మూవీ యూనిట్ తో పాటు షూటింగ్ స్పాట్ లో ఉన్న మత్స్యకారులకు చేపల పులుసు వడ్డించారు. ఈ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు.
షూటింగ్ చాలా వరకు ఉత్తరాంధ్రలో జరుగుతుంది. విశాఖపట్నం, శ్రీకాకుళం తీరాల్లోషూటింగ్ చేస్తున్నారు. విశాఖ లో జరుగుతున్నపుడు వారి పధ్దతిలో చేపల పులుసు చేసి వారికి వడ్డిస్తానని నాగచైతన్య మాటఇచ్చారట. దాన్ని ఫుల్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక తండేల్ సినిమా వచ్చే నెల 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.