Akhil Akkineni: అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ !

నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. 


Published Jan 20, 2025 12:33:00 PM
postImages/2025-01-20/1737356701_Zainab.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అక్కినేని అఖిల్ కు పెళ్లి ఫిక్స్ అయ్యిందని అందరికి తెలిసిందే.  ఇప్పటి వరకు ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉండే అఖిల్  ఈ మార్చి తో ఫ్యామిలీ మ్యాన్ అయిపోతాడు.  త్వరలో వైవాహిక బంధలోకి అడుగుపెట్టనున్నాడు . రీసెంట్ గా జైనాబ్ రవడ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్ మెంట్ జరిగింది. నాగచైతన్య పెళ్లి సమయంలోనే అఖిల్ కూడా తన ప్రేయసితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. 


హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. నిశ్చితార్ధం విషయం కూడా సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. అఖిల్ , జైనబ్ పిక్స్ ను షేర్ కూడా చేశారు. 


మార్చి24న అఖిల్ వివాహం జరగబోతుందని తెలుస్తుంది. సినీ సెలబ్రెటీలు , రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెటర్స్ ను కూడా వీరి వివాహానికి ఆహ్వానించనున్నారని తెలుస్తుంది. అయితే మార్చిలో అఖిల్ కు పెళ్లి అవుతుంది. కాగా గతంలో అఖిల్ ఓ అమ్మయితో ఎంగేజ్ మెంట్ చేసుకొని క్యాన్సిల్ చేసుకున్నారు. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu wedding nagachaitanya akhil-akkineni

Related Articles