డిల్లీలోని నజఫ్ గడ్ లో నిర్మించనున్న సావర్కర్ కాలేజీ విషయంలో బిజేపీ, కాంగ్రెస్ లమధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఢిల్లీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. పొలిటికల్ పార్టీలు ఒకరిపై ఒకరు విమర్మలు చేసుకుంటూ రాజకీయాల్లో హీట్ ను పెంచుతున్నారు. ఇండియా కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ భాగస్వామిగా ఉన్నప్పటికి కాంగ్రెస్ పైనే ఆయన కామెంటలు చేయడం పెద్ద దుమారం రేపుతుంది. ఇంతకీ కేజ్రీవాల్ చేస్తున్న కామెంట్లు ఏంటి ..అవి బీజేపీ కి ..కాంగ్రెస్ కు ఎలా తలనొప్పులుగా మారాయంటే..
.
డిల్లీలోని నజఫ్ గడ్ లో నిర్మించనున్న సావర్కర్ కాలేజీ విషయంలో బిజేపీ, కాంగ్రెస్ లమధ్య మాటల యుద్దం నడుస్తోంది. ఈ కాలేజీ నిర్మాణానికి మోడీ శంకుస్థాపన చేశారు ఈ కాలేజీకి దివంగత నేల మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుంది. కాని సావర్కర పేరు పెట్టడానికి కాంగ్రెస్ తప్పుపట్టడమే కాకుండా ..ఫ్రీడమ్ ఫైటర్స్ చేసిన త్యాగాలను బీజేపీ లెక్కచెయ్యడం లేదని మండిపడుతుంది . దీనికి బీజేపీ కి చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ ఇచ్చింది.
ఈ వివాదం కొనసాగుతున్న వేళ.. ఆప్ ప్రభుత్వంపై ప్రధాని మోడీ తీవ్ర విమర్శలు చేశారు.. ఢిల్లీ ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో ఆప్ విఫలమైందని మండిపడ్డారు. గత పదేళ్లు గా ఢిల్లీ ప్రజల అవసరాలు తీర్చడం లో ఆప్ అసలు ఫెయిల్ అయ్యిందని ఆరోపించారు. అంతే కాదు ఈ సారి బీజేపీ కే ప్రజలు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఆప్ ను ఓడించేందుకు బిజేపీ, కాంగ్రెస్ లు ఏకమయ్యాయని.. వారి కుట్రలను ఛేదించి..మరోసారి అధికారంలోకి వస్తామని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. ఇలా మూడు పార్టీలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేస్తూ ఢిల్లీ వాతావరణాన్ని మరింత హీటెక్కిస్తుంది.