ఆన్ లైన్ మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: జనాలు జాగ్రత్తగా పడుతున్న కొద్దీ ఆన్ లైన్ మోసాలు జరుగుతూనే ఉన్నాయి. దీని కోసం తెలంగాణ పోలీసులు రాష్ట్ర ప్రజలను హెచ్చరించారు. మీ అత్యాశే మోసగాళ్ల పెట్టుబడి అని అన్నారు. చిన్న పొరపాటుతో చాలా మంది ఖాతాల్లో డబ్బులు మాయమవుతున్నాయని తెలిపారు. మీ ఫోన్ కు ఏం మెసేజ్ లు వచ్చినా సందేశాలను నమ్మవద్దని చెప్పారు. ఆన్ లైన్ మోసాలపై తెలంగాణ పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నారు.
మీకు ఆన్ లైన్ లో ఏదైనా వస్తువులు తక్కువ ధరకు ఇస్తామన కాని ..ఏదైనా గ్రీటింగ్ కార్డ్స్ . ఫార్వర్డ్ మెసేజ్ లు కాని వస్తే వాటిని ఓపెన్ చెయ్యొద్దని తెలిపారు. ఎప్పటికప్పుడు ట్వీట్లు చేస్తూ జనాలను అప్రమత్తం చేస్తున్నారు. అపరిచితుల నుంచి వచ్చే మెసేజ్ లకు స్పందించవద్దని, అనవసర లింక్స్ పై క్లిక్ చేసి సమస్యలు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు.
మీ వ్యక్తిగత విషయాలు వేరే వాళ్లతో చర్చించవద్దు. ఆన్ లైన్ స్నేహితులు డబ్బు అడిగినా పంపవద్దని తెలిపారు అంతే కాదు బంపర్ ఆఫర్ , లక్కీ డ్రా పేరుతో ఉచితంగా బహుమతిలు ఇష్తామనే వాటికి మీరు అస్సులు టెంప్ట్ అవ్వద్దని తెలిపారు. రూపాయి ఎరవేసి లక్షలు ఖాళీ చేస్తారని అత్యాశ పడవద్దని తెలిపారు.