మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని ...దాని గురించి ప్రశ్నించినందుకే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని తెలిపారు
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : జల్ పల్లిలోని తన ఆస్థులను కొందరు ఆక్రమించుకుంటున్నారని వారిని ఖాళీ చేయించి తన ఆస్థులను తమకు అప్పగించాలని రంగారెడ్డి జిల్లా మేజిస్ట్రేట్ కు మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా అదనపు కలక్టర్ ప్రతిమ సింగ్ ను మంచు మనోజ్ కలిశారు. తమ కుటుంబంలో గొడవలపై చర్చించారు.
ఈ సందర్భంగా మీడియాతో మనోజ్ మాట్లాడుతూ... తమ కుటుంబంలో ఆస్తుల వివాదాలు లేవని చెప్పారు. అసలు మా గొడవలో ఆస్థి గొడవలకు తావే లేదని తెలిపారు. మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్ధులకు అన్యాయం జరుగుతుందని ...దాని గురించి ప్రశ్నించినందుకే ఈ గొడవలన్నీ జరుగుతున్నాయని తెలిపారు. విష్ణు చేస్తున్న నాటకమే ఈ గొడవ అని అన్నారు. నాన్నను అడ్డం పెట్టుకుని విష్ణు నాటకం ఆడుతున్నారని చెప్పారు. నాన్నను తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని తెలిపారు. విద్యార్థులు, తన కుటుంబం, బంధువుల కోసమే తన పోరాటమని చెప్పారు. తనకు న్యాయం దక్కేంత వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.