టీజర్లో 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు' అంటూ ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: విశ్వక్ సేన్ లీడ్ రోల్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ లైలా ... డైరక్టర్ రామ్ నారాయణ్ తెరకెక్కిస్తున్నారు. సాహూ గారపాటి నిర్మిస్తున్నారు. వాలెంటైన్స్ డే కు రిలీజ్ చేయాలనుకుంటున్న ఈ సినిమా ఈ రోజు టీజర్ రిలీజ్ చేశారు. టీజర్లో 'మనకు తెల్లగా చేసుడే కాదు. తోలు తీసుడు కూడా వచ్చు' అంటూ ఉన్న డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీ లో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించారు. ఈ సీన్ కూడా టీజర్ లో చూపించారు. మూవీ లవర్స్ కు విశ్వక్ గెటప్ మరింత క్రేజీ గా అనిపిస్తుంది.
కాగా, ఈ సినిమాలో విశ్వక్‌కు జంటగా ఆకాంక్ష శర్మ నటిస్తోంది. వెన్నెల కిషోర్, రవి మారియా, హర్ష వర్థన్, బ్రహ్మాజీ, రఘు బాబు తదితరులు ఆయా పాత్రల్లో కనిపించనున్నారు. తనిష్క్ బాగ్చి, జిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గరపాటి ఈ సినిమా నిర్మించారు.