ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు. రోజా కూడా చాలా వరకు రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: స్మాల్ స్క్రీన్ మీద రోజా చేసిన హంగామా అందరికి తెలిసిందే. జబర్ధస్త్ తో పాటు చాలా షోస్ చేశారు. అయితే మంత్రి అయ్యాక ఇక స్మాల్ స్క్రీన్ దూరం అయ్యారు. గత ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చిన తర్వాత రోజా జబర్దస్త్ ని కూడా వదిలేసి ఇకపై టీవీ షోలు, సినిమాలు చేయను, ప్రజలకు నా జీవితం అంకితం అంటూ ఎమోషనల్ అయింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో లేదు. రోజా కూడా చాలా వరకు రాజకీయాల్లో అంత యాక్టివ్ గా లేరు.
అందుకే రోజా జీ తెలుగు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ 4 లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ షోకి సంబంధించి ప్రోమో రిలీజ్ చేసారు. రోజాతో పాటు శ్రీకాంత్ , రాశి ఈ షోలో జడ్జీలుగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఈ షో మార్చ్ 2 ఆదివారం సాయంత్రం 6 గంటలకు మొదలుకానుంది. ఈ షోకి రవి, అషురెడ్డి యాంకర్స్ గా చేయనున్నారు. మరో నాలుగేళ్లు ఇదే ప్రభుత్వం కాబట్టి మళ్లీ ఎన్నికల వరకు రోజా మేడం ఖాళీనే. అందుకే మరో సారి స్క్రీన్ మీద బిజీ కావడానికి వచ్చారు.
జబర్దస్త్ లో నాగబాబు, రోజా వెళ్లిపోయిన తర్వాత ఎవరూ ఫిక్స్ జడ్జి లేరు, కొన్ని కొన్ని వారాలు ఒక్కొక్క సెలబ్రిటీ చేస్తున్నారు. నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ కార్యకలాపాలతో బిజీగా ఉన్నారు, ఆయన మళ్ళీ వచ్చేలా కనపడట్లేదు. ఇప్పుడు రోజా ఎంట్రీ ఓ వర్గం వారిని చాలా హ్యాపీ చేసింది.