sunil shetty : కర్ణాటక మఠానికి రోబోటిక్ ఏనుగును దానం చేసిన బాలీవుడ్ నటుడు !

ఆలయ సంప్రదాయాల్లో భాగంగా ఏనుగును వినియోగిస్తుంటారు. దీనికోసం అటవీ ఏనుగులను బంధించి, శిక్షణ ఇస్తుంటారని పెటా ప్రతినిధులు చెబుతున్నారు. 


Published Feb 24, 2025 06:55:00 PM
postImages/2025-02-24/1740403696_mechanicalelephantphoto800x1067167763382809216776338489361677633848936.jpeg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: కర్ణాటకలోని ధావణగెరె శిలామఠం నిర్వాహకులు ఆదివారం రోబోటిక్ ఏనుగుకు స్వాగతం పలికారు. మేళతాళాలతో గ్రామంలో ఊరేగించారు. ఆ రొబొటిక్ ఏనుగుకు స్వాగతం పలికారు. స్వామి వారికి ఈ రొబోటిక్ ఏనుగును ఉమేమహేశ్వర్ అని పేరు పెట్టారు. అంతేకాదు ఈ ఏనుగును ముంబై కు చెందిన కుపా సంస్థతో కలిసి మూగజీవాల పరిరక్షణకు కృషి చేస్తున్న పెటా సంస్థ తరుపున బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఈ రోబో ఏనుగును దేవాలయానికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆలయ సంప్రదాయాల్లో భాగంగా ఏనుగును వినియోగిస్తుంటారు. దీనికోసం అటవీ ఏనుగులను బంధించి, శిక్షణ ఇస్తుంటారని పెటా ప్రతినిధులు చెబుతున్నారు. 


అయితే మఠానికి సంబంధించిన పనులన్నీ ...ఆ ఏనుగుతో చేస్తున్నారు. ఆ ఏనుగును స్వేఛ్ఛగా వదిలేయడం కోసం ఇలా రోబో ఏనుగులు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే ఇప్పటికే చాలా ఆలయాలకు , మఠాలకు అందించామని చెప్పారు. అయితే ఒక్కో రోబో ఏనుగును తయారుచేయడానికి దాదాపు రూ. 17 లక్షల వరుకు ఖర్చవుతుందని వివరించారు. థాకర్సే సంస్థ ఇందుకు నిధులు సమకూరుస్తోంది. ఆ మధ్యన శిల్పాశెట్టి కూడా చిక్కమగళూరు జిల్లాలోని రంభపురి మఠానికి ఇలాగే రోబోటిక్ ఏనుగును విరాళంగా ఇచ్చారు. 

 

Related Articles