కలుషిత నీటిని తాగుతూ ఇబ్బందిపడుతున్న గ్రామస్థులకు నీటి సమస్య లేకుండా ఆర్ వో వాటర్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: రాజకీయనాయకులు , సినిమా హీరోలు స్వఛ్ఛంధంగా సేవాకార్యక్రమాలను చెయ్యడం జరుగుతూనే ఉంటుంది. కొన్ని వెనుకబడిన గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామినికి నీళ్లు , కరెంట్ , రోడ్లు వేస్తూ తమకు తోచిన సాయం చేస్తుంటారు. అలా టాలీవుడ్ హీరో ..బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ ఆదిత్య ఓం తెలంగాణ లోని ఓ గిరిజన గ్రామానికి చెందిన చెరుపల్లిలో నీటిసమస్యను పరిష్కరించేందుకు ముందుకొచ్చారు. కలుషిత నీటిని తాగుతూ ఇబ్బందిపడుతున్న గ్రామస్థులకు నీటి సమస్య లేకుండా ఆర్ వో వాటర్ ను అందించే ప్రయత్నం చేస్తున్నారు.
ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అయితే ఈ ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి సంక్రాంతి పండుగ నుంచి ఆర్వో ప్లాంట్ అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా కలుషితనీటి వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆదిత్య ఓం సినీ కెరీర్ విషయానికి వస్తే 'లాహిరి లాహిరి లాహిరి' మూవీతో వెండి తెరకు పరిచయం అయ్యాడు. అంతే కాదు .. గత ఏడాది 'నాతో నేను' మూవీలో కీలక పాత్రలో కనిపించాడు. ఈ ఏడాది పాప్యులర్ టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో సందడి చేశాడు. తాజాగా 'బందీ' మూవీలో ఆదిత్య ఓం నటిస్తున్నాడు. ఈ మంచి నీటి ఏర్పాట్లతో గ్రామస్థులు చాలా సంతోషిస్తున్నారు.