కన్నప్ప మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటికే మూవీ యూనిట్ ఈ డేట్ ను ప్రకటించేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా రాబోతున్న భారీ బడ్జెట్ మూవీ కన్నప్ప ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ డైరక్షన్ లో వస్తున్న మూవీ కన్నప్ప . దీనిని 24 ప్రేమ్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు వంటి స్టార్స్ నటిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కన్నప్ప మూవీ వచ్చే యేడాది ఏప్రిల్ 25 న థియేటర్లలో విడుదల అవుతుంది. ఇప్పటికే మూవీ యూనిట్ ఈ డేట్ ను ప్రకటించేసింది.
తాజాగా ఈ మూవీకి సంబంధించి అప్డేట్ విడుదల చేస్తూ ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ప్రీతి ముకుందన్ ప్రిన్సెస్ నెమలి పాత్రలో నటిస్తున్నట్టు తెలుపుతూ ఆమె ఫస్ట్ లుక్ షేర్ చేశారు. అందమైన రూపంతో పాటు నెమలి లాంటి రాయల్ లుక్ ఆమెలో కనిపిస్తుంది. “అందంలో సహజం, తెగింపులో సాహసం. ప్రేమలో అసాధారణం. భక్తిలో పారవశ్యం. కన్నప్పకి సర్వస్వం. చెంచు యువరాణి నెమలి” అనే క్యాప్షన్ జత చేసి హైప్ పెంచేశారు. మంచు విష్ణుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని ఆమె పాత్ర చాలా స్పెషల్ అని వెల్లడించారు.