ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనపడుతోంది. ఫొటోలను చూస్తున్న నెటిజన్లు, అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ లో చాలా యేళ్ల పాటు అగ్రనటిగా కొనసాగుతున్న సమంత ఎంతో మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకుంది. నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత పెద్ద గా తెలుగు సినిమాలు లిస్ట్ లేదు. ఖుషి చేసింది. తర్వాత తెలుగులో పెద్దగా కనిపించలేదు. అయితే హిందీ లో మాత్రం సిటాడెల్ తో ఫుల్ స్పీడ్ లో ఉంది.అయితే రీసెంట్ సమంతకు చెందిన కొన్ని ఫొటోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్నాయి. ఆ ఫొటోల్లో సమంత బేబీ బంప్ తో కనపడుతోంది. ఫొటోలను చూస్తున్న నెటిజన్లు, అభిమానులు షాక్ కు గురవుతున్నారు.
తనకు మాతృత్వాన్ని అనుభవించాలని ఉందని గతంలో సమంత చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో, తన కలను ఆమె నెరవేర్చుకుందా? అని కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. గతంలో తనకు తల్లి గా ఉండాలని ఉందనే విషయం ఓపెన్ గా చెప్పింది. అయితే తన మాటలకు ఏఐ తో ఇలా పిక్స్ క్రియేట్ చేశారంటున్నారు నెటిజన్లు.
సమంత నిజంగా ప్రెగ్నెంట్ కాదు. ఎవరో ఈ ఫొటోలను ఏఐని ఉపయోగించి క్రియేట్ చేశారు. సమంత ప్రెగ్నెంట్ అని గతంలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొంతమంది మాత్రం ఏఐ చాలా డేంజర్ ...ఇలా మనకు నచ్చిన విషయాన్ని ఇలా ఏఐ తో మానిప్యూలేట్ చెయ్యడం కూడా బాధాకరమే అంటు కామెంట్లు చేస్తున్నారు.