బాలీవుడ్ లో కాస్త హాట్ టాపిక్ . రామాయణం లో సీత గా నటిస్తున్న ఆమె ... మరో బాలీవుడ్ మూవీ కి సంతకాలు చేసిందని టాక్ .
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటించిన అమరన్ మూవీ రీసెంట్ బ్లాక్ బాస్టర్ . మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా రాజ్ కుమార్ పెరియస్వామి డైరక్షన్ లో 350 కోట్లు వసూలు చేసిన సినిమా. అయితే సాయిపల్లవి ఇప్పుడు బాలీవుడ్ లో కాస్త హాట్ టాపిక్ . రామాయణం లో సీత గా నటిస్తున్న ఆమె ... మరో బాలీవుడ్ మూవీ కి సంతకాలు చేసిందని టాక్ .
రామయణ్ లో రణబీర్ కపూర్ ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు తెలుగు, తమిళ్ లోనూ నటిస్తుంది పల్లవి. తమిళ్ లో రీసెంట్ గా అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది సాయి పల్లవి. తెలుగు లో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తుంది. ఈ ఇద్దరు కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. సాయి పల్లవి మరో హిందీ సినిమా లో నటిస్తుంది.
తాజాగా సాయి పల్లవి అమీర్ ఖాన్ కుమారుడు జునైద్‌తో జతకడుతూ కొత్త సినిమాకు సైన్ చేసిందనే టాక్ నడుస్తుంది, ప్రదీప్ రంగనాథన్ లవ్ టుడే హిందీ రిమేక్ అయిన లవ్యప్ప తో జునైద్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను త్వరలో రిలీజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అందులో సాయిపల్లవి హీరోయిన్ అనే టాక్ నడుస్తుంది . ఇది సాయిపల్లవి మాత్రం ఏం అనౌన్స్ చెయ్యలేదు.