Prabhas: లైఫ్ లో ఎంజాయ్ చెయ్యాలంటే చాలా ఉన్నాయి ..డ్రగ్స్ అవసరమా !

రేపు న్యూయర్ కాబట్టి ఈ రోజు రాత్రి ఈ వెంట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఓ మెసేజ్ వీడియోతో ప్రభాస్ వీడియో వచ్చింది.


Published Dec 31, 2024 04:09:00 PM
postImages/2024-12-31/1735641799_406116rebelstarprabhas.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: సినీ నటుడు ప్రభాస్ డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా ఓ ప్రచార వీడియోను రిలీజ్ చేశారు. "మన కోసం బ్రతికేవాళ్లు ఉన్నారు... లైఫ్ లో కిక్కు ఇచ్చే పనులు చాలా ఉన్నాయి.. ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్" అంటూ వీడియోలో సందేశం ఇచ్చారు. రేపు న్యూయర్ కాబట్టి ఈ రోజు రాత్రి ఈ వెంట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఓ మెసేజ్ వీడియోతో ప్రభాస్ వీడియో వచ్చింది.


"లైఫ్‌లో మనకు బోలెడు ఎంజాయ్‌మెంట్స్ ఉన్నాయి... కావాల్సినంత ఎంటర్టైన్‌మెంట్ ఉంది... మనం ప్రేమించేవాళ్లు ..అమ్మ నాన్న ..అక్క చెల్లి ఇలా మంది మన కోసం బ్రతికే మనవాళ్లు మనకు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్?" అంటూ వీడియోను విడుదల చేశారు. 


డ్రగ్స్‌కు నో చెప్పండి... అలాగే మీకు తెలిసిన వాళ్లు ఎవరైనా డ్రగ్స్‌కు బానిసలైతే తెలంగాణ ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ (87126 71111)కు ఫోన్ చేయాలని ఆ వీడియోలో సూచించారు. న్యూయర్ పార్టీ ఈవెంట్ లో డ్రగ్స్‌కు బానిసైన వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.న్యూయర్ పార్టీ ఈవెంట్ లో ఎలాంటి అశ్లీలత కాని డ్రగ్స్ కాని ఉండకూడదని పోలీసులు ఇప్పటికే చెప్పారు. న్యూయర్ ఈవెంట్స్ కు కొన్ని రూల్స్ కూడా జారీ చేశారు.

 

Related Articles