2024 ప్రేమ, శాంతితో గడిచిపోయిందని ఆమె వెల్లడించింది. తన కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్, భర్త మైఖేల్‌తో గడిపిన క్షణాలను వీడియో ద్వారా ఇలియానా పంచుకున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : టాలీవుడ్ లో ఒకప్పుడు భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉండే హీరోయిన్స్ లో ఇలియానా ఒకరు. అమ్మడు నడుము ఒంపులకు క్రేజీ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే బాలీవుడ్ కు వెళ్లి కాస్త సౌత్ ను లైట్ తీసుకుంది. బాలీవుడ్ లో మొదట కాస్త హిట్లుపడినా ఇప్పుడు అమ్మడు కు పెద్దగా మార్కెట్ లేదు.అయితే అమ్మడు రీసెంట్ గా న్యూయర్ సంధర్భంగా తన సెకండ్ ప్రెగ్నెన్సీని అనౌన్స్ చేసింది. ఈ గుడ్ న్యూస్ ను ఆమె ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని అనౌన్స్ చేసింది. ఆ వీడియోలో... 2024 ప్రేమ, శాంతితో గడిచిపోయిందని ఆమె వెల్లడించింది. తన కుమారుడు కోవా ఫీనిక్స్ డోలన్, భర్త మైఖేల్‌తో గడిపిన క్షణాలను వీడియో ద్వారా ఇలియానా పంచుకున్నారు.
అయితే తను అక్టోబర్ లో గర్భం దాల్చినట్లు ప్రెగ్నెన్సీ కిట్ ను చూపించింది. అయితే మొదటి ప్రెగ్నెన్స్ీ 2023 లో ఆగస్టులో కొడుకు పుట్టాడు. అప్పటి నుంచి సినిమాలకు దూరం గా ఉన్న ఇలియానా ఇంత ఫాస్ట్ సెకండ్ ప్రెగ్నెన్సీ అనౌన్స్ చెయ్యడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. మరికొందరు మాత్రం బెస్ట్ విషెస్ చెబుతూ కామెంట్లు పెట్టారు.